త్రివిక్రమ్ సినిమా టైటిల్ కి కొంచెం తిక్కుంది – కానీ పవన్ స్టైల్ కో లెక్కుంది.

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న త్రివిక్రమ్ దర్శకత్వం లోని చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు. ఆరోజే చిత్ర TITLE ని కూడా ప్రకటిస్తారు. ఈ చిత్రానికి ఇప్పటికే దేవుడే దిగివచ్చినా, గోకుల కృష్ణుడు, చుట్టేద్దాం రారండి వంటి టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.కానీ ఏ టైటిల్ ని కూడా చిత్ర యూనిట్ కంఫర్మ్ చేయలేదు.

తాజాగా మరో TITLE సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. పవన్ త్రివిక్రమ్ ల చిత్రానికి ‘రాజు వచ్చినాడు’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల కానుండడంతో ఇదే టైటిల్ దాదాపుగా ఫైనల్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా ఈ సినిమా టైటిల్ విషయంలో నెలకొన్న సందిగ్దత తొలగాలంటే సెప్టెంబర్ 2 వరకు ఆగాల్సిందే.

More from my site

Comments

comments