‘ఉన్నది ఒకటే జిందగీ’ ట్వీట్ రివ్యూ

6:15 AM : ఎమోషనల్ క్లైమాక్స్ సన్నివేశంతో చిత్రం ముగిసింది.

6:05 AM : చిత్రంలో ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది.

5:56 AM : స్నేహితుల మధ్య ఆసక్తికరమైన సంభాషణ తరువాత టైటిల్ సాంగ్ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వస్తోంది.

5:45 AM : వరుసగా ఫ్రెండ్ షిప్ మరియు ప్రేమకు సంబందించిన సీన్స్ వస్తున్నాయి.

5:35 AM : స్నేహితుల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.

5:25 AM : శ్రీవిష్ణు మరియు లావణ్య మధ్య ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.

5:20 AM : పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి పెళ్లి కొడుకుగా ఎంట్రీ ఇచ్చాడు. రామ్, శ్రీ విష్ణు లతో పాటు వారి గ్యాంగ్ మొత్తం సీన్ లోకి ఎంటర్ అయింది. ప్రస్తుతం సూపర్ హిట్ సాంగ్ ‘వాట్ అమ్మా’ వస్తోంది.

5:15 AM : ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. సెకండ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంట్రీ ఇచ్చింది. పెళ్లికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.

5:05 AM : ఫస్ట్ హాఫ్ : ఇప్పటివరకు చిత్రం డీసెంట్ గా సాగింది. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో సాగిన కథ, మూడు పాటలు ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ద్వితీయార్థం చిత్రానికి కీలకం కానుంది.

5:00 AM : ఊహించని ట్విస్ట్ తో చిత్రం సగభాగం పూర్తయింది. ఇప్పుడు ఇంటర్వెల్.

4:50 AM : ప్రస్తుతం ‘లైఫ్ ఈజ్ ఏ రైన్ బో’ సాంగ్ వస్తోంది. చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.

4:40 AM : శ్రీ విష్ణు మళ్లీ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. చిత్రంలో భారీ ట్విస్ట్ వచ్చింది.

4:31 AM : హీరో హీరోయిన్ల మధ్య కొని ఆసక్తికరమైన సన్నివేశాల తరువాత ‘రయ్యి రయ్యి మంటూ’ సాంగ్ వస్తోంది. అనుపమని సింగర్ గా చూపిస్తున్నారు.

4:21 AM : హీరో హీరోయిన్ల మధ్య స్నేహం పెరుగుతోంది. వారి మధ్య మరిన్ని సన్నివేశాలు వస్తున్నాయి.

4:10 AM : అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. లీడ్ పెయిర్ మధ్య పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.

4:06 AM : ప్రస్తుతం చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ ‘ట్రెండు మారిన’ వస్తోంది. అందమైన లొకేషన్స్ లో సాంగ్ షూట్ చేశారు.

4:00 AM : చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లింది. కాలేజీ సన్నివేశంలో రామ్, శ్రీవిష్ణులు ఎంటర్ అయ్యారు. రామ్ గడ్డం లుక్ లో బావున్నాడు.

3:54 AM : చిత్రం ప్రజెంట్ డే కి మారింది. హీరో రామ్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. చిత్రంలో పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.

3:50 AM : చిన్న పిల్లల మధ్య ఉన్న స్నేహాన్ని చాటి చెప్పే సన్నివేశాలు వస్తున్నాయి.

3:45 AM : టైటిల్స్ పడుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో చిన్ననాటి సన్నివేశాలు వస్తున్నాయి.

3:40 AM : హాయ్.. చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.

Comments

comments