‘వివేకం’ ట్వీట్ రివ్యూ

Time : 07:17 AM : భారీ ఫైట్ తరువాత చిత్రం ముగిసింది.

 

Time : 07:12 AM : విలన్ కాజల్ ని బంధించి అజిత్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. కాజల్ ని కాపాడేందుకు అజిత్ వెళ్లాడు.

 

Time : 07:04 AM: బాంబు అటాక్ ని ఆపడానికి అజిత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఉత్కంఠ భరితమైన సన్నివేశం వస్తోంది.

 

Time : 07:00 AM : చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. హీరో, విలన్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది.

 

Time : 06:54 AM: భారీ బాంబ్ అటాక్ కి విలన్ పథకం రచించాడు. దాని గురించి తెలుసుకునేందుకు అజిత్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం లీడ్ పెయిర్ మధ్య ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.

 

Time : 06:48 AM: సమస్య నుంచి బయట పడడానికి అజిత్ తన తెలివి ఉపయోగిస్తున్నాడు. ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.

 

Time : 06:43 AM : హీరో అజిత్ పై టెర్రరిస్ట్ ముద్ర పడింది. 80 దేశాలకు అతడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా భావిస్తున్నారు. ఉత్కంఠ భరితమైన సీన్స్ వస్తున్నాయి.

 

Time : 06:38 AM : అజిత్, కాజల్ మధ్య ‘ఆనందం’ సాంగ్ మరో వెర్షన్ లో వస్తోంది.

 

Time : 06:35 AM: అజిత్ జాడ తెలుసుకునేందుకు వివేక్ ఒబెరాయ్ కూడా కాజల్ ని వెంటాడుతున్నాడు. కొన్ని ఆసక్తికరమైన సీన్స్ వస్తున్నాయి.

 

Time : 06:30 AM: మాఫియా గ్యాంగ్ తిరిగి ఎంటర్ అయింది. ఈ సారి కాజల్ ని అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Time : 06:25 AM: ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది. చిత్రం ప్రజెంట్ డే కి వచ్చింది. హీరోకి, విలన్ కి మధ్య ఆసక్తికరమైన ఫోన్ సంభాషణ జరుగుతోంది.

 

Time : 06:20 AM: ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది.ఓ అటాకింగ్ సీన్ తో పాటు భగ భగ సాంగ్ వస్తోంది.

 

Time : 06:10 AM: ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చిత్రం పరాలేదనిపించే విధంగా మాత్రమే ఉంది. కథలో ఎలాంటి కొత్తదనం లేదు. విజువల్స్ బావున్నాయి. టేకింగ్ స్టైలిష్ గా ఉంది.

 

Time : 06:05 AM: కథలో అనుకోని ఘటన జరిగింది. ఓ మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడింది. ఇప్పుడు బ్రేక్.

 

Time : 06:00 AM: సీక్రెట్ ఆపరేషన్ కు సంబందించిన కాల్ ని వివేక్ ఒబెరాయ్ నుంచి అజిత్ అందుకున్నాడు. మరో వైపు అజిత్, అక్షర లని టెర్రరిస్ట్ గ్యాంగ్ కూడా అటాక్ చేసింది. కొన్ని భారీ సన్నివేశాలు వస్తున్నాయి.

 

Time : 05:55 AM: అక్షర హాసన్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అజిత్ ఆమెని మాఫియా గ్యాంగ్ నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తునాడు. ప్రస్తుతం బైక్ చేజ్ సీన్ వస్తోంది.

 

Time : 05:45 AM: హ్యాకర్ గురించి అజిత్ సమాచారం తెలుసుకున్నాడు. కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.

 

Time : 05:39 AM: అజిత్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఓ మాఫియా ప్రదేశంలోకి వెళ్లాడు. ప్రస్తుతం స్టైలిష్ ఫైట్ వస్తోంది.

 

Time : 05:34 AM: 120 దేశాల్లో భయంకరమైన హ్యాకింగ్ కు సంబంధించిన కదలికల్ని అజిత్ కనుగొన్నాడు. టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.

 

Time : 05:27 AM: సెర్బియాలో అజిత్ ల్యాండ్ అయ్యాడు. సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ని ప్రారంభించాడు.

 

Time : 05:20 AM: ఉగ్రవాద కదలికల నేపథ్యంలో అజిత్ రెడ్ అలర్ట్ ని అందుకున్నాడు. అతడి టీంతో కలసి సెర్బియాకు పయనం అవుతున్నాడు.

 

Time : 05:10 AM: అజిత్ భార్యగా కాజల్ అగర్వాల్ అందమైన ఎంట్రీ ఇచ్చింది. వీరి మధ్య రొమాంటింక్ సన్నివేశంతో ‘ఆనందం అనందం’ అనే సాంగ్ వస్తోంది.

 

Time : 05:05 AM: వివేక్ ఒబెరాయ్ అజిత్ సామర్థ్యాన్ని వివరిస్తున్నాడు. చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లింది. ప్రస్తుతం ‘సుర్వివ’ సాంగ్ వస్తోంది.

 

Time : 05:00 AM: వివేక్ ఒబెరాయ్ మిలిటరీ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అతడి పరిచయానికి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.

 

Time : 04:55 AM: హీరో అజిత్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. ఉగ్రవాదుల స్థావరాలపై అటాక్ కి అతడు ప్రయత్నిస్తున్నాడు.

 

Time : 04:50 AM: టైటిల్స్ మొదలయ్యాయి. భయంకరమైన ఉగ్రవాద కార్యకలాపాల్ని బ్యాక్ గ్రౌండ్ లో చూపిస్తున్నారు.

 

Time : 04:45 AM: హాయ్..149 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.

More from my site

Comments

comments