హిట్ సినిమాకి-హిట్ చేసిన సినిమాకి తేడా తెలుసా ?

బాగుంది జూనియర్…మంచి పిట్ట కథే..కానీ ఇక్కడ చిన్న తేడా ఉంది. మీ కథలో అటూ ఇటూ తిరుగుతూ రోగి గురించి వ్యాఖ్యానాలు చేసే
దానయ్యలకూ లోపల రోగికి ఆపరేషన్ చేస్తున్న వైద్యులకీ సంబంధం లేదు…కానీ సినిమా సమీక్ష విషయంలో విమర్శకులు కూడా మీరు
చెప్పిన వైద్యులే. వాళ్లు థియేటర్లోకి వెళ్లి సినిమా చూసి, అంటే మీ భాషలో రోగికి చికిత్స అందించి బయటకు వచ్చి స్టేటస్ చెపుతున్నారు.
మీరు మీ కథా రచనలో ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయారు. సినీ విమర్శకుడు మొదట ప్రేక్షకుడే. ఆ తరువాతే క్రిటిక్. ఇతను పేషంట్ ను పరీక్షించి స్థితి తెలుసుకుని ఆపరేషన్ ధియేటర్ బయటకు వచ్చి స్టేటస్ చెపుతున్నాడు. లోపల మరి కొందరు నిపుణులు ఆ రోగికి వైద్యం అందిస్తుండి ఉండవచ్చుగాక. అంత మాత్రం చేత మొదట చూసి వచ్చిన వైద్యుడికి స్టేటస్ ప్రకటించే హక్కు లేదంటే ఎలా తారక్. వందో మూడొందలో ఖర్చు పెట్టీ ఓ మూడు గంటలు వెచ్చించిన ఇతను దారినపోయే దానయ్య ఎలా అయాడో ఒక్కసారి చెప్పండి ప్లీజ్. మీ కథాకథనం ప్రకారం చూసుకున్నా సినిమా చూసే ప్రేక్షకులంతా వైద్యులే కనుక మొదట అటెండయిన వైద్యుడు ఈ దానయ్యే కదా…

మీ జైలవకుశలో మీ పెర్ఫార్మెన్స్ గురించి అటు ప్రధాన మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎన్టీఆర్ చెత్తగా నటించాడని రాసిన
ఒక్కటంటే ఒక వాక్యం చూపించగలరా. అందరూ మీ రావణుఢ్ని విపరీతంగా లవ్వాడారు బాస్.
మీరు బిగ్ బాస్ ను అద్చుతంగా నడిపారన్న వారే తప్ప చండాలంగా హోస్ట్ చేసారన్న పోస్ట్ ఒక్కటంటే ఒక్కటి చూపగలరా. వీళ్లందరినీ దానయ్యలనే అందామా సర్. జనతా గారేజ్ లో మోహన్ లాల్ తో ధీటుగా జూనియర్ నిలబడ్డాడని విమర్శకులు ఘోషించినపుడు సమ్మగానే ఉంది కదా సర్.అదే సినిమాలో కార్పోరేషన్ కార్యాలయం సీన్ గురించి ఉత్ప్రేక్షాలంకారాలతో మోసేసినపుడూ తీయగానే ఉంది కదా సర్.

అయినా, ఒక రచయితకు ఆత్మతృప్తి సహృదయుడైన పాఠకుడి విమర్శలో లభిస్తుందేతప్ప ఒక విమర్శకుడి జడ్జిమెంటులో కాదనేది నా అభిప్రాయం. సోషియల్ మీడియాలో ఆ direct interface లభిస్తుంది. అప్పుడప్పుడూ విమర్శల్లో సూటిపోటి మాటలూ, ఎత్తిపొడుపులూ తప్పవు.

ధియరీ అంతా తిరిగొచ్చి అసలు కథకొస్తే, “పాఠకుడూ, సాహితీ విమర్శకుడు వేరు వేరు కాదు” అన్నా,అనుకున్నా ‘కేవలం పాఠకుడు’ – ‘కేవలం విమర్శకుడు’ మధ్యలో “పాఠకవిమర్శకుడు” ఒకడున్నాడు. వాడు ఛస్తే ఊరుకోడు. పాఠకుల్ని కేవలం పాఠకులుగా ఉండనీడు.

“పాఠకవిమర్శకుడి” ఉద్దేశం, స్ఫూర్తి అది కాదు. ఒక విధంగా చూస్తే విమర్శకుడు యజమాని అవ్వాలని ప్రయత్నిస్తే పాఠకుడు పుస్తకానికి దాసొహం అంటాడు. కానీ పాఠకవిమర్శకుడు రచయితకు/పుస్తకానికీ సమస్థాయిలో నిల్చి ఒక అర్థవంతమైన చర్చకు ప్రయత్నిస్తాడు. This is more of an equal relationship in that sense. ఇక్కడ దాసోహం, ఆధిపత్యం రెండూ లేవుకాబట్టి “విశాలత్వానికి” అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతర పాఠకుల ధృక్కోణాల్ని సహానుభూతితో (సానుభూతి కాదు), సమగౌరవంతో, సహృదయతతో చూసే అవకాశం ఉంది. రచయితతో సమానులుగా ప్రవర్తిస్తున్నాం గనక స్నేహభావానికి ఆస్కారముంది.

అయినా సినిమా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే ———————-

ఇది వ‌ర‌కు, వంద రోజుల మోజులో ఉన్న‌ప్పుడు డ‌బ్బులు ఎదురిచ్చి మ‌రీ వంద ఆడించేవారు. `మా సినిమా ఇన్ని సెంట‌ర్ల‌లో వందాడింది తెలుసా` అని చెప్పుకోవ‌డానికి త‌ప్ప అదెందుకూ ఉప‌యోగ‌ప‌డేది కాదు. ఇప్పుడూ అంతే. మా సినిమా వంద కోట్లు కొట్టింది అని చెప్పుకోవ‌డానికి మిన‌హా ఈ కాకి లెక్క‌లు ఎందుకూ ప‌నిచేయ‌వు. ఓ సినిమా వ‌సూళ్లు ఇంత అని చెప్ప‌డానికి సాధికారిక వ్య‌వ‌స్థ ఏం లేదు. టికెట్ల‌న్నీ ఆన్ లైన్‌లో పెట్టి, వ‌సూళ్లు కూడా ఆన్‌లైన్‌లోనే చూపించి, చూపించిన వ‌సూళ్ల‌కు ప‌న్ను క‌ట్టాల్సిందే అనే రూల్ ఉంటే త‌ప్ప‌.. అస‌లు లెక్క‌లు బ‌య‌ట‌ప‌డ‌వు. ఇన్నాళ్లు వంద సెంట‌ర్ల కోసం కొట్టుకొన్న వాళ్లు, ఇప్పుడు వంద కోట్ల క్ల‌బ్ కోసం కొట్టుకొంటున్నారంతే. కొన్నాళ్ల‌కు ఇదీ ఉండ‌దు. మ‌రోటేదో వ‌స్తుంది. ఇవ‌న్నీ సినిమాలు తీస్తున్న‌వాళ్ల‌కు గానీ, చూస్తున్న‌వాళ్ల‌కు కాదు. ఏది మంచి సినిమానో, కాదో.. వాళ్ల‌కు తెలుసు. ఈ డ్రామాలు టికెట్ లేని వినోదం మాత్ర‌మే. ఈ విష‌యాన్ని సినిమాలు తీస్తున్న‌వాళ్లు తెలుసుకోవాలి.

More from my site

Comments

comments