సినిమా టైటిల్ ఏంటి.. ఈ రొమాన్స్ ఏంటి రాజు గారు..!

బాహుబలి తర్వాత భళ్లాలదేవ అదేనండి దగ్గుబాటి వారసుడు రానా చేస్తున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి. టీజర్ ట్రైలర్ తో ఒక్కసారిగా అందరిని ఆకట్టుకున్న ఈ సినిమా అసలు తేజ డైరక్షన్ లో వస్తున్న మూవీయేనా అన్న ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా సినిమాలో ప్రస్తుత రాజకీయ పరిణామాలతో కూడిన డైలాగ్స్ అబ్బో అదరగొట్టేశారు.

ట్రైలర్ తో సంచలనంగా మారిన ఈ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం కొత్తగా కనిపిస్తుంది. అదెలా అంటే సినిమా ట్రైలర్ లో పొలిటికల్ థ్రిల్లర్ అన్నట్టు బిల్డప్ ఇస్తున్న ఈ చిత్రయూనిట్ మరో పక్క హీరోయిన్ కాజల్ తో రానా చేసే రొమాన్స్ కూడా హైలెట్ చేస్తూ వస్తుంది. దశాబ్ధ కాలం నుండి చూస్తున్నా కాజల్ ఇలా రెచ్చిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.

మరి సినిమా టైటిల్ చూస్తేనేమో రాజు మంత్రి అంటూ ఉంది.. ప్రమోషన్స్ లోనేమో కాజల్ తో రానా రొమాన్స్ కవ్విస్తుంది. అసలు సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఆలోచన ఆడియెన్స్ లో మొదలైంది. ఆగష్టు 11న రిలీజ్ అనుకున్న ఈ సినిమా పోటీలో మరో రెండు సినిమాలు ఉండటంతో రిస్క్ ఎందుకనుకుని ఆగష్టు థర్డ్ వీక్ కు పోస్ట్ పోన్ చేశారట. అయితే ఆ విషయం ఇంకా దర్శక నిర్మాతలు క్లారిటీ ఇవ్వలేదు.

More from my site

Comments

comments