‘యుద్ధం శరణం’ ట్వీట్ రివ్యూ

05:56 AM : చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం వేచి ఉండండి

05:53 AM : హీరో విలన్ మధ్య భారీ ఫైట్ సీన్ తరువాత చిత్రం ముగింపుకు చేరుకుంది.

 

05:51 AM : చిత్రంలో మరో ట్విస్ట్ వచ్చింది. ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లేతో చిత్రం సాగుతోంది.

05:46 AM : చిత్రం క్లిమక్స్ దిశగా సాగుతోంది. నాగ చైతన్య, శ్రీకాంత్ మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది.

05:43 AM : నాగ చైతన్య తన కుటుంబాన్ని కాపాడుకుని సేఫ్ ప్లేస్ కు పంపాడు. ప్రస్తుతం హీరో, విలన్ మధ్య ముఖాముఖీ ఫైట్ వస్తోంది.

05:33 AM : నాగచైతన్య తన సిస్టర్స్ ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. భారీ ఛేజింగ్ సీన్ వస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో టైటిల్ సాంగ్ వస్తోంది.

05:23 AM : నాగ చైతన్య అటాక్ ప్లాన్ గురించి శ్రీకాంత్ కు తెలిసింది. ప్రస్తుతం ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.

05:14 AM : చిత్రం మొత్తం మంచి స్క్రీన్ ప్లే తో సాగుతోంది. నాగచైతన్య, విలన్లకి మధ్య మైండ్ గేమ్ నడుస్తోంది.

05:10 AM : ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. ఇన్వెస్టిగేషన్ కి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో ‘పద్మవ్యూహం’ సాంగ్ ప్లే అవుతోంది.

05:05 AM : ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చిత్రం పరవాలేదనిపించే విధంగా సాగింది. మధ్యలో వచ్చిన ట్విస్ట్ లు, ఎమోషన్స్ తో కూడుకున్న ఫ్యామిలీ సన్నివేశాలు బావున్నాయి.

05:00 AM : విలన్ గ్యాంగ్ నుంచి నాగ చైతన్య తెలివిగా తప్పించుకున్నాడు. ఇప్పుడు ఇంటర్వెల్..

04:55 AM : శ్రీకాంత్ కి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి. విలన్ గ్యాంగ్ హీరో పై అటాక్ కి ప్లాన్ చేస్తున్నారు.

04:46 AM : చిత్రం మళ్లీ ప్రెజెంట్ డే కి మారింది. చిన్న ట్విస్ట్ వచ్చింది.

04:42 AM : ‘ఎన్నో ఎన్నో భావాలే’ అనే అందమైన ఫ్యామిలీ సాంగ్ వస్తోంది. సాంగ్ లో అద్భుతమైన కుటుంబ సన్నివేశాల్ని చూపిస్తున్నారు.

04:38 AM : మరి కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి. హీరోకి కుటుంబంతో ఉన్న బంధాన్ని బలంగా చూపిస్తున్నారు.

04:28 AM : చిత్రంలో మరో సాంగ్ ‘నీ వలనే’ వస్తోంది. సాంగ్ లో కొన్ని అందమైన ఫ్యామిలీ సీన్స్ ని జోడించారు.

04:20 AM : చిత్రం మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. కుటుంబ నేపథ్య సన్నివేశాలు వస్తున్నాయి.

04:18 AM : ఫ్లాష్ బ్యాక్ ముగిసింది. హీరోకి పోలీస్ అధికారి మురళి శర్మ కు మధ్య సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి.

04:12 AM : సాంగ్ పూర్తయింది. హీరోకి, అతడి తండ్రికి మధ్య ఫ్రెండ్లీ సీన్స్ వస్తున్నాయి.

04:08 AM : ఫన్నీ సీన్స్ తరువాత అందమైన ‘మొహమాటం’ సాంగ్ వస్తోంది.

03:58 AM : హీరోయిన్ లావణ్య త్రిపాఠి డాక్టర్ అంజలిగా ఎంట్రీ ఇచ్చింది. హీరో, హీరోయిన్ల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది.

03:56 AM : చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది. నాగచైతన్య తల్లిందండ్రులుగా రావు రమేష్, అలనాటి హీరోయిన్ రేవతి పరిచయం అయ్యారు. కమెడియన్ ప్రియదర్శి హీరో ఫ్రెండ్ గా ఎంట్రీ ఇచ్చాడు.

03:50 AM : నాగచైతన్య స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.

 

03:48 AM : చిత్రంలో టైటిల్స్ మొదలయ్యాయి.. నటుడు రాజా రవీంద్ర సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. అతడు భీకరమైన శ్రీకాంత్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తున్నాడు.

 

03:42 AM : హాయ్.. ‘యుద్ధం శరణం’ చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.

More from my site

Comments

comments